ఎట్రాక్ట్ చేస్తున్న 'కృష్ణార్జున యుద్ధం' ఫస్ట్ సింగిల్

Tuesday,January 16,2018 - 02:59 by Z_CLU

నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకుంటుంది. అయితే సంక్రాంతి కన్నా ముందే ఈ 3 రోజుల పాటు ఫస్ట్ లుక్స్ తో పాటు, ఫైనల్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసిన మూవీ టీమ్, పండగ సీజన్ లో సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయింది.

వరసగా 13, 14 న ఫస్ట్ లుక్స్ తో ఇంప్రెస్ చేసిన మూవీ టీమ్, ఈ రోజు రిలీజ్ కానున్న సింగిల్ పై భారీగా ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. ఫైనల్ గా ఈ రోజు నుండి హిప్ హాప్ తమిజా కంపోజ్ చేసిన ఈ సాంగ్, ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసే పనిలో పడింది.

సినిమాలో ‘కృష్ణ’ లవ్ లో పడే సిచ్యువేషన్ లో ఉండబోయే ఈ సాంగ్, కొత్తగా అనిపించడమే కాదు, ఈ సాంగ్ లో ఉండే నాని స్టిల్స్ ని బట్టి, న్యాచురల్ స్టార్ ని ఇంతకు ముందెన్నడూ రేంజ్ లో ఈ సినిమాలో చూడబోతున్నామని క్లారిటీ ఇస్తుంది ఈ లిరికల్ వీడియో. పెంచల్ దాస్ పాడిన ఈ సాంగ్ కి తానే లిరిక్స్ రాసుకోవడం విశేషం.