విలన్ గా ఎన్టీఆర్...

Friday,January 27,2017 - 01:26 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక పై సరి కొత్త క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేస్తానని ఇక నుంచి జెనెరేషన్ లో వచ్చే మార్పు ను బట్టే సినిమా సెలెక్ట్ చేసుకుంటానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ పై ఇకనుంచీ ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నాడట తారక్. బాబీ కథ కి ఓటెయ్యడానికి మెయిన్ రీసన్ కూడా ఇదేనని సమాచారం.

ఇప్పటికే ‘నాన్న కు ప్రేమ తో’,’జనతా గ్యారేజ్’ సినిమాల్లో ఇలాంటి డిఫెరెంట్ క్యారెక్టర్సే చేసి ఫాన్స్ తో పాటు ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఎన్టీఆర్ ప్రెజెంట్ తన నెక్స్ట్ లో సినిమాలో కూడా అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ తోనే ఎంటర్టైన్ చేయబోతున్నాడట. ఈ సినిమా లో మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్న తారక్ అందులో ఒక క్యారెక్టర్ లో మాత్రం విలన్ గా కనిపించి ఆడియన్స్ కు కొత్త అనుభూతి కలిగించబోతున్నాడట. ఫుల్ నెగటివ్ షెడ్ తో ఉండే ఈ క్యారెక్టర్ సినిమాకె హైలైట్ గా నిలవనుందనే టాక్ కూడా టాలీవుడ్ లో గట్టి గా వినిపిస్తుంది. ఇక ఇటీవలే ’24’ సినిమాలో ఆత్రేయ అనే నెగిటీవ్ క్యారెక్టర్ లో కనిపించి అదుర్స్ అనిపించుకున్న సూర్య లాగే ఎన్టీఆర్ కూడా ఈ క్యారెక్టర్ తో శెభాష్ అనిపించుకుంటాడని ఇన్సైడ్ టాక్. మరి విలన్ గా తారక్ ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్….