రోబో 2.0 టీజర్ రిలీజ్ డేట్

Friday,January 27,2017 - 02:30 by Z_CLU

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హై ఎండ్ టెక్నికల్ ఎంటర్ టైనర్ రోబో 2.0 ఫైనల్ షెడ్యూల్ కి దగ్గర పడింది. జనవరి 30 నుండి మళ్ళీ సెట్స్ పైకి రానున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ పూర్తి చేసుకుంటే మ్యాగ్జిమం ప్యాకప్ చెప్పెసినట్టే. ఇక గ్రాఫిక్ వర్క్సే పెండింగ్.

ఈ ఫైనల్ షెడ్యూల్ ని చెన్నై ఆవుట్ స్కర్ట్స్ లోని మహాబలిపురం లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్, ఈ సినిమా టీజర్ ని ఏప్రిల్ 14 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది.

ఇప్పటికే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్న రోబో 2.0 లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి A.R. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.