క్వశ్చన్స్ రేజ్ చేస్తున్న బాహుబలి 2 పోస్టర్

Friday,January 27,2017 - 12:29 by Z_CLU

బాహుబలి మానియా బిగిన్ అయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జక్కన్న రిలీజ్ చేసిన పోస్టర్ ని ఫ్యాన్ పెద్ద ట్రీట్ లా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మ్యాగ్జిమం స్పేస్ ఈ డిస్కషన్స్ తోనే నిండిపోతుంది.

అమరేంద్ర బాహుబలిని బాహుబలి బిగినింగ్ లోనే చూసేశారు కానీ, అనుష్క మాత్రం ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా, ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది. దానికి తోడు ఈ పోస్టర్ లో ఉన్న ఆర్టిస్టిక్ సీక్వెన్స్ ఏ సిచ్యువేషన్ కి సంబంధించినదై ఉంటుందా అనే క్వశ్చన్ కి ఆన్సర్, ఎంత డిస్కస్ చేసికున్నా తేలడం లేదు.

ఇంతకీ ఈ సీక్వెన్స్ దేవసేనకి యుద్ధ విద్యలు నేర్పుతున్నప్పుడు తెరకెక్కిందా..? లేకపోతే యుద్దానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు తెరకెక్కించిందా..? అసలు దేవసేన కథలో ఎప్పుడు ఎంటర్ అవుతుంది..? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు బాహుబాలి ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న బాహుబలి కంక్లూజన్ ప్రస్తుతం ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకునే స్టేజ్ లో ఉంది.