దూసుకుపోతున్న "సోలో బ్రతుకే.." సాంగ్

Sunday,June 14,2020 - 11:46 by Z_CLU

సాయితేజ్ హీరోగా నటించిన సినిమా సాలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. “నో పెళ్లి” అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ఊహించని విధంగా హిట్టయింది. క్యాచీ ట్యూన్ కు సింపుల్ సాహిత్యం తోడవ్వడంతో అంతా దీన్ని హమ్ చేస్తున్నారు.

అలా ఇనిస్టెంట్ గా హిట్ అయిన ఈ సాంగ్ కు ఇప్పుడు ఏకంగా కోటి వ్యూస్ వచ్చాయి. అవును.. యూట్యూబ్ లో “నో పెళ్లి” సాంగ్ కోటి వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది.

తమన్ కంపోజ్ చేసిన అల వైకుంఠపురములో సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత హిట్టయ్యాలో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్స్ తర్వాత తమన్ నుంచి క్లిక్ అయిన పాట ఇదే.

SVCC బ్యానర్ పై సాయితేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సినిమా విడుదల తేదీని త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు.