దుమ్ము దులుపుతున్న "నో పెళ్లి" సాంగ్

Monday,June 01,2020 - 01:21 by Z_CLU

త్వరలోనే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సాయితేజ్. ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా నో పెళ్లి అనే సాంగ్ ను విడుదల చేశారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట దుమ్ముదులుపుతోంది. తాజాగా 5 మిలియన్ వ్యూస్ రాబట్టింది ఈ సాంగ్.

ప్రస్తుతం తమన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా అలవైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అందుకున్న ఈ కంపోజర్.. ఇప్పుడు అదే ఫామ్ ను “సోలో బ్రతుకే..” సినిమాకు కూడా కొనసాగిస్తున్నాడు. నో పెళ్లి అనే పాట ఇనిస్టెంట్ గా హిట్టయింది.

సుబ్బు అనే దర్శకుడ్ని పరిచయం చేస్తూ సాయితేజ్ చేసిన ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. రావురమేశ్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.