రికార్డులు కొల్లగొడుతున్న సాంగ్

Wednesday,July 08,2020 - 03:03 by Z_CLU

ఇటీవలే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుండి విడుదలైన “నో పెళ్లి” సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటూ దూసుకెళ్తుంది. రిలీజ్ కి ముందే ప్రోమో తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సాంగ్ విడుదలైన వెంటనే పాపులర్ సాంగ్ అనిపించుంది. ఇటివలే రేడియో చార్ట్ బస్టర్స్ లో నంబర్ 1 స్థానం అందుకున్న ఈ సాంగ్ తాజాగా యూ ట్యూబ్ లో మంచి రికార్డు అందుకుంది.

తక్కువ టైంలో భారీ వ్యూస్ కొల్లగొట్టిన ఈ సాంగ్ లేటెస్ట్ గా 100K లైక్స్ సొంతం చేసుకొని మరో రికార్డు సృష్టించింది. తమన్ కంపోజ్ చేసిన ట్యూన్ కి రఘు రామ్ అందించిన లిరిక్స్ , అర్మాన్ మాలిక్ సింగింగ్ అన్నీ కలిసి రావడంతో రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ సాంగ్ అనిపించుకొని యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ పాట.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సాయితేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లు.