సైరా దర్శకుడితో ఇస్మార్ట్ హీరో

Sunday,June 14,2020 - 11:38 by Z_CLU

ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రామ్ కెరీర్‌ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. ఈ మూవీలో ఎనర్జిటిక్ స్టార్ యాక్టింగ్ చూసి మాస్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు.

ఇస్మార్ట్ ఊపును అలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు రామ్. ఇందులో భాగంగా సురేందర్ రెడ్డితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కిక్, రేసుగుర్రం సినిమాల టైపులో ఫుల్ జోష్ లో హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుందట.

గతేడాది మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కించాడు సురేందర్. ‘సైరా’ సినిమా వచ్చి చాన్నాళ్లవుతున్నా ఈ దర్శకుడి నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు. అలా లాంగ్ గ్యాప్ తర్వాత రామ్ తో కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు సురేందర్.

‘రెడ్’ సినిమా రిలీజైన వెంటనే సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట ఎనర్జిటిక్ స్టార్.