సైలెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నితిన్

Thursday,February 23,2017 - 01:58 by Z_CLU

హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నితిన్ సినిమాలో ఇంతకీ నితిన్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఏంటి..? ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ జెనెరేట్ చేస్తున్న క్వశ్చన్ ఇదే. ‘అ..ఆ’ సినిమాతో లవర్ బాయ్ నుండి ఫ్యామిలీ హీరోగా ప్రమోట్ అయిన నితిన్ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది సినీ టౌన్ గా మారింది.  

అనౌన్స్ మెంట్ లేదు, స్పెషల్ ఇంటరెస్ట్ క్రియేట్ చేయలేదు… ఎంత సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్నాడో అంతే సైలెంట్ గా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేశాడు నితిన్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా డెఫ్ఫినేట్ గా సమ్ థింగ్ స్పెషల్ మూవీ అని క్లారిటీ ఉన్నా.. ఖైదీ గెటప్ లో ఎట్రాక్ట్ చేస్తున్న నితిన్ ఫస్ట్ లుక్, సైలెంట్ గానే… ఈ  సినిమాని హాట్ టాపిక్ గా మార్చేసింది.

సమ్మర్ లో రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిల్ సుంకర, రాం ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై బేసిగ్గానే ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడీ ఫస్ట్ లుక్ తో సినిమాపై జరుగుతున్న డిస్కషన్స్ గ్రాఫ్ ఏ రేంజ్ కి వెళ్ళి ఆగుతుందో… చూడాలి.