సూపర్ స్టార్ సినిమాలో విద్యా బాలన్

Tuesday,February 21,2017 - 11:37 by Z_CLU

ఓ వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో 2.0 తో బిజీగా ఉన్నాడు. ఈ హై ఎండ్ టెక్నికల్ వెంచర్ తరవాత సూపర్ స్టార్ ఇమ్మీడియట్ గా కబాలి డైరెక్టర్ పా. రంజిత్ తో సెట్స్ పై ఉంటాడు. ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి పూర్తి డీటేల్స్ అయితే బయటికి రాలేదు కానీ ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఓ  ఇంటరెస్టింగ్ టాపిక్ ట్రెండింగ్ అవుతుంది.

ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ సినిమాలో విద్యా బాలన్ హీరోయిన్ గా చేసే చాన్సెస్ ఉన్నాయనే బజ్, జస్ట్ సౌత్ ఇండియానే కాదు బాలీవుడ్ లోనూ భారీ సైజు వైబ్రేషన్స్ నే క్రియేట్ చేస్తున్నాయి.

 

మే నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని, సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది.