సుకుమార్ చెర్రీ సినిమాకోసం లొకేషన్ల వేట

Tuesday,February 21,2017 - 03:45 by Z_CLU

ఆర్య తరవాత చెర్రీ కోసం సొంతంగా సినిమా రాసుకున్నాడు సుకుమార్. సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఆర్య రేంజ్ హిట్ గ్యారంటీ అని ఫిక్సయ్యారు ఫ్యాన్స్. కొత్తగా ఉండాలని ఏకంగా 80’s బ్యాక్ డ్రాప్ లో చెర్రీని సరికొత్తగా ప్రెజెంట్ చేయాలని స్కెచ్ వేసుకున్నాడు లెక్కల మాస్టారు. అంతా బాగానే ఉంది. కానీ స్టోరీకి తగ్గట్టు లొకేషన్స్ కోసం ట్రై చేసినప్పుడే అసలు సమస్య బిగిన్ అయింది.

రెగ్యులర్ సినిమా అయి ఉంటే అంత ప్రాబ్లం అయ్యేది కాదేమో.. 80’s బ్యాక్ డ్రాప్ అనగానే ప్రతి ఫ్రేం దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలి. కాస్ట్యూమ్స్, మేకప్ లాంటివి డిజైన్ చేసుకోవడం పెద్ద సమస్య కాదేమో కానీ లొకేషన్స్ ని ఫిక్స్ చేసుకోవడానికే నానా తంటాలు పడుతుంది సినిమా యూనిట్.

AP లోని మ్యాగ్జిమం లొకేషన్స్ ని పరిశీలించేసిన సినిమా యూనిట్, ప్రస్తుతం తమిళనాడులోని ప్లెజెంట్ విలేజ్ లొకేషన్స్ కోసం వేట మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ వేట ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందో చూడాలి.