కాటమరాయుడు రిలీజ్ డేట్ లో చేంజెస్

Thursday,February 23,2017 - 12:50 by Z_CLU

ఇండస్ట్రీలో ఫాస్ట్ పేజ్ లో, ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ లో ఏ మాత్రం తేడా లేకుండా వీలైతే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ కన్నా ముందే సినిమాకి ప్యాకప్ చెప్పే యూనిట్ ఏదైనా ఉందంటే అది పవర్ స్టార్ సినిమా యూనిటే. సినిమా సినిమాకి మధ్య ఏ మాత్రం గ్యాప్ లేకుండా చూసుకునే పవన్ కళ్యాణ్, సెట్స్ పైకి వచ్చిన సినిమాకి  అనుకున్న టైం లో ప్యాకప్ చెప్పే విషయంలోనూ అంతే సీరియస్ గా ఉంటాడు.

కాటమరాయుడు విషయంలో అటు సినిమా సెట్స్ పై ఉండగానే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి పెట్టిన సినిమా యూనిట్, అంతకు ముందే అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ ‘మార్చి 28’ కన్నా ముందే ప్రాడక్ట్ ని ప్యాక్ కూడా చేసేసే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా డిలే కాకుండా రిలీజ్ అవుతుందంటే టెన్షన్ ఏముంది హ్యాపీసే కదా.. కానీ అలా ఆలోచిస్తే అది పవర్ స్టార్ టీం ఎందుకవుతుంది..? వాళ్ళ మైండ్ లో ఇంకేదో నడుస్తుంది.

ఉగాది ట్రీట్ గా రిలీజ్ కావాల్సిన కాటమరాయుడిని.. ఓ నాలుగు రోజులు ముందుగానే అంటే మార్చి 24 నే థియేటర్స్ లోకి తెచ్చే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందని చిన్న టాక్. ఈ విషయంలో ఇప్పటిదాకా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ.. ఈ లోపు సినిమా 4 రోజులు ముందుగానే రిలీజ్ అనగానే ఒక్కసారిగా పవర్ స్టార్  ఫ్యాన్స్ లో పవర్ రేజ్ అవుతుంది. ఈ టాక్ గాని కన్ఫర్మేషన్ గ ట్రాన్స్ ఫాం అయి, ఉగాదికి రిలీజ్ కావాల్సిన కాటమరాయుడు నాలుగు రోజులు ముందుగానే రిలీజైతే ఉగాది సందడి కూడా నాలుగు రోజులు ముందుగానే బిగిన్ అయిపోతుంది.