ఫ్రైడే రిలీజ్

Thursday,February 23,2017 - 02:57 by Z_CLU

ఈ ఫ్రైడే కూడా జోర్దార్ సినిమాలతో రెడీ అయిపోయింది. ఓ వైపు లాస్ట్ వీక్ రిలీజైన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తూనే, మరో వైపు కొత్త రిలీజెస్ తో గెట్ రెడీ అయిపోయింది సినీ టౌన్. ఈ ఫ్రైడే ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలివే.

 

విజయ్ ఆంటోని, మియా జార్జ్ జంటగా నటించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ యమన్. భేతాళుడు లాంటి బ్లాక్ బస్టర్ తరవాత రిలీజవుతున్న సినిమా కాబట్టి న్యాచురల్ గానే సినిమాపై హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకి జీవ శంకర్ డైరెక్టర్. విజయ్ ఆంటోని మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

 సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన విన్నర్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండే మెగా కాన్సంట్రేషన్ ని తన వైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయింది. దానికి తోడు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ఫాం లో సాయి ధరం తేజ్, దానికి తోడు రకుల్ ప్రీత్ సింగ్ సినిమా మెయిన్ ఎట్రాక్టివ్ గా నిలుస్తున్నారు.  గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. నల్ల మలుపు బుజ్జి, టాగూర్ మధు కలిసి ఈ సినిమాని నిర్మించారు.

 

 

సైఫ్ ఆలీ ఖాన్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో 1939 – 1955 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రొమాంటిక్ వార్ థ్రిల్లర్. విశాల్ భరద్వాజ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి సాజిద్ నడియాడ్ వాలా. బాలీవుడ్ లో ఇప్పటికే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.