మరోసారి తెరపైకి నితిన్-ఇలియానా?

Sunday,July 07,2019 - 11:10 by Z_CLU

వీళ్లిద్దరూ కలిసి ఇప్పటికే ఓ సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి తెరపైకి రాబోతోంది ఈ జంట. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నితిన్ సినిమాలో ఇలియానా మరోసారి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది.

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు నితిన్. ఈ సినిమాలో రకుల్, ప్రియా వారియర్లను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ గా ఇలియానా కోసం ప్రయత్నిస్తున్నారట. సినిమాలో ఓ కీలకమైన పాత్రలో ఇలియానా కనిపించనుంది.

అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది ఇలియానా. అయితే ఆ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ ఆమెకు గ్యాప్ తప్పలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా నితిన్ సినిమా ఆఫర్ ఆమె చెంతకు చేరింది. ఇలియానా ఎంట్రీ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.