అంచనాలు పెంచిన 'బందోబస్త్' టీజర్

Sunday,July 07,2019 - 04:29 by Z_CLU

తీవ్రవాదం వలన భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు… రైతులు, నది జలాల సమస్యలు… ఇండియన్ ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్స్ నేపథ్యంలో రూపొందిన డిఫరెంట్ అండ్ న్యూ ఏజ్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్ ను హీరో రానా లాంచ్ చేశాడు. తాజా టీజర్ తో అంచనాలు మరింత పెరిగాయి.

ఆర్య, సాయేషా సైగల్ పెళ్లి తర్వాత జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ తర్వాత లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో సూర్య… కమాండోగా, ముస్లిమ్ వ్యక్తి కథిర్‌గా, సుభాష్‌గా డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నారు. ఈ టీజ‌ర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. రాజకీయం, జర్నలిజం, నక్సలిజం నేపథ్యంలో ‘రంగం’ వంటి సూప‌ర్‌హిట్‌ థ్రిల్లర్ ప్రేక్షకులకు అందించిన దర్శకుడు కె.వి. ఆనంద్, అంతకు మించి ఉత్కంఠ కలిగించే అంశాలతో యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’ రూపొందించారని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

ఈ సినిమాను ఆగస్ట్ 30న వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నారు. హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.