Macherla Niyojakavargam - వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన నితిన్ మూవీ

Friday,August 12,2022 - 08:42 by Z_CLU

Macherla Niyojakavargam Released worldwide today

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. లాంగ్ గ్యాప్ తర్వాత నితిన్ నుంచి థియేటర్లలోకి వస్తున్న సినిమా ఇది. అందుకే అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా మాస్ కంటెంట్, కమర్షియల్ సబ్జెక్ట్ కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అందరి అంచనాల్ని పెంచుతూ, ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది మాచర్ల నియోజకవర్గం.

ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ కలెక్టర్ రోల్ పోషించాడు నితిన్. చూడ్డానికి క్లాస్ గా కనిపిస్తూనే, మాస్ ఫైట్స్ చేశాడు. ఆ విషయాన్ని ట్రయిలర్ లోనే చెప్పేశాడు. ఇప్పటికే థియేటర్లలోకొచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలెట్ అని అంటున్నారు సినిమా చూసినోళ్లు.

అటు ఓవర్సీస్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా రోజులైందని, ఆ లోటును మాచర్ల నియోజకవర్గం తీర్చిందని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు. ఏపీ,నైజాంలో దాదాపు 660కి పైగా స్క్రీన్స్ ఈ సినిమాకు దక్కాయి. నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.