మళ్లీ సెట్స్ పైకి వచ్చిన నాగశౌర్య

Sunday,July 07,2019 - 10:07 by Z_CLU

ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో తెర‌కెక్కిస్తున్న సినిమా షూటింగ్ వైజాగ్ లో జ‌రుగుతుండ‌గా హీరో నాగ‌శౌర్య  కాలికి గాయమైన విష‌యం తెలిసిందే.. ఆ త‌రువాత హైద‌రాబాద్ చేరుకుని రెస్ట్ తీసుకున్నాడు. డాక్ట‌ర్ల స‌లహ మేర‌కు చిన్న స‌ర్జ‌రీ కూడా జ‌రిగింది.

అలా ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన నాగశౌర్య, ఇప్పుడు తన కొత్త సినిమాను తిరిగి ప్రారంభించాడు. హైదరాబాద్ లో నాగశౌర్య కొత్త సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ మూవీకి అశ్వద్ధామ అనే టైటిల్ అనుకుంటున్నారు.

ఛ‌లో లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న ఈ  చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమాలో నాగ‌శౌర్యకి జంట‌గా మెహరీన్ నటిస్తుంది.