ముచ్చటగా మూడోసారి

Wednesday,February 08,2017 - 05:41 by Z_CLU

లవర్ బాయ్ ఇమేజ్ నుండి అ..ఆ.. సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా తన ఫ్యాన్ బకెట్ లో వేసుకున్న నితిన్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కరియర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్ రెడీ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నితిన్, థర్డ్ మూవీ కూడా అనౌన్స్ చేసేశాడు.

గతంలో ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ లాంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన ప్రొడ్యూసర్ K.K.రాధా మోహన్ బ్యానర్ లో సినిమా చేయనున్నాడు నితిన్. ప్రస్తుతం హను రాఘవపూడి సినిమాలో నటిస్తున్న నితిన్, ఈ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే కృష్ణ చైతన్య డైరెక్షన్ లో మరో సినిమా సెట్స్ పై ఉంటాడు.

nithin-next-movie

ఈ లోపు ప్రీ ప్రొడక్షన్ పనులపై కాన్సంట్రేషన్ చేయనున్న రాధా మోహన్ సినిమా యూనిట్, ఈ రెండు సినిమాలు పూర్తయ్యే లోపు ఈ వెంచర్ ని లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి తక్కిన డీటేల్స్ తెలియాల్సి ఉంది.