రెండు పెద్ద సినిమాల్లో కీలక మార్పులు...

Wednesday,February 08,2017 - 04:36 by Z_CLU

కోలీవుడ్ లో రెండు బడా సినిమాల్లో ఉన్నట్టుండి రెండు పెద్ద మార్పులు చోటుచేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇళయదళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో జ్యోతిక నటించబోతుందనే టాక్ మొన్నటి వరకూ వినిపించగా ప్రెజెంట్ జ్యోతిక ప్లేస్ లో నిత్య మీనన్ ను తీసుకున్నారనే వార్త కోలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. అయితే సినిమా అనౌన్స్ మెంట్ కి ముందు జ్యోతిక పేరు చెప్పకపోయినా ఈ సినిమాలోని స్పెషల్ రోల్ కోసం ఆమెను సంప్రదించారని… ఆల్ మోస్ట్ ఈ రోల్ కి జ్యోతిక ఫిక్స్ అని అంతా అనుకున్నారు. అయితే ఇంతలోనే ఆమె స్థానంలో నిత్యామీనన్ ను తీసుకున్నారు. జ్యోతికను ఎందుకు తప్పించారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇక కోలీవుడ్ లో మరో బడా సినిమాలో కూడా ఇలాంటి మార్పే జరిగింది. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి హీరోయిన్ గా ఫస్ట్ సాయి పల్లవి పేరు వినిపించగా ఆ స్థానంలో మొన్నటివరకు అను ఇమ్మానుయేల్ పేరు వినిపించింది. ఫైనల్ గా ఈ సినిమాకు ఈ ఇద్దర్నీ పక్కనపెట్టి రీతూ వర్మ ను ఫైనల్ చేశారు. పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ లో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా విక్రమ్ సినిమాలో ఛాన్స్ సంపాదించడం టోటల్ సౌత్ లోనే హాట్ టాపిక్ గా మారింది.