'రంగ్ దే' రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Wednesday,March 11,2020 - 11:20 by Z_CLU

ప్రస్తుతం ‘భీష్మ’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న నితిన్ నెక్స్ట్ ‘రంగ్ దే’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జులై 30 రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారు మేకర్స్. నిజానికి ఇది ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు కన్ఫర్మ్ చేసుకున్న డేట్.

కానీ అనుకోకుండా సినిమా సంక్రాంతికి పోస్ట్ పోన్ అవ్వడంతో ఇప్పుడు ఆ డేట్ పై కన్నేసాడు నితిన్. త్వరలోనే అఫీషియల్ గా ఈ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నారు.వెంకీ అట్లూరి మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాకు పీ.సీ.శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండటం విశేషం.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.