మొదటి షెడ్యుల్ పూర్తి చేసిన వరుణ్ !

Wednesday,March 11,2020 - 11:57 by Z_CLU

వరుణ్ తేజ్ ఇటివలే తన పదవ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వైజాగ్ లో మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యుల్ పూర్తయింది. ఈ షెడ్యుల్ లో వరుణ్ తేజ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసారు. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత హైదరాబాద్ లో రెండో షెడ్యుల్ ప్రారంభం కానుందని సమాచారం.

బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాక్సింగ్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు వరుణ్. అల్లు బాబీ, సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుంది. జులై లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.