నితిన్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్

Thursday,October 10,2019 - 09:02 by Z_CLU

నితిన్ ‘రంగ్ దే’ సినిమా మ్యూజిక్ డిఫెరెంట్ గా ఉండబోతుంది. ఎంత డిఫెరెంట్ గా ఇప్పటి వరకు నితిన్ సినిమాల్లో ఎపుడూ ఓ పర్టికులర్ మార్క్ తో సాంగ్స్ కంపోజ్ అవ్వలేదు. ఈ సారి ఆ మార్క్ ‘రంగ్ దే’ లో ఉండబోతుంది. అదే DSP మార్క్. నితిన్ ఇన్నేళ్ళ కరియర్ లో ఒక్క సినిమాకు కూడా DSP మ్యూజిక్ కంపోజ్ చేయలేదు. ఈసారి ‘రంగ్ దే’ సినిమాతో ఈ కాంబో కుదరనుంది.

లెక్క ప్రకారం వెంకీ అట్లూరి సినిమా అంటే తప్పకుండా తమన్ ఉండాల్సిందే. ఈ యంగ్ డైరెక్టర్స్ చేసిన 2 సినిమాలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్సే. కాబట్టి ఈ సారి కూడా వెంకీ కంఫర్ట్ ఉన్న కంపోజర్ ని పిక్ చేసుకుంటాడనుకున్నారంతా. కానీ అంచనాలను తారుమారు చేస్తూ ఈ వరసలో DSP చేరాడు.

ఇప్పటికే నితిన్, కీర్తి సురేష్, వెంకీ అట్లూరి… ఫస్ట్ టైమ్ ‘రంగ్ దే’ తో కలిసి పనిచేయబోతున్నారు. వీరికి తోడు DSP అనగానే ఈ సినిమా పై మరింత ఫ్రెష్ ఫీలింగ్ జెనెరేట్ అవుతుంది.

ఇప్పటికే ఈ సినిమాకి ఆల్మోస్ట్ సాంగ్స్ కంపోజ్ చేయడం పూర్తి చేసేశాడు DSP. నితిన్ కరియర్ లో మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా లాంచ్ అయిన రోజు నుండే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.