పెళ్ళి గెటప్ కి ప్యాకప్ చెప్పిన నితిన్

Tuesday,June 19,2018 - 12:41 by Z_CLU

నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ లో పెళ్ళి వేడుకలు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి.  అమలాపురంలో దాదాపు 20 రోజులుగా ఈ సినిమాకి  సంబంధించి పెళ్ళి సీక్వెన్సెస్ ని తెరకెక్కిస్తున్న ఫిల్మ్ మేకర్స్, ఈ పెళ్ళి ఎపిసోడ్ కి ప్యాకప్ చెప్పేశారు. రీసెంట్ గా హైదరాబాద్ కి తిరిగి వచ్చిన టీమ్, నెక్స్ట్ షెడ్యూల్ లో నాన్ వెడ్డింగ్ సీక్వెన్సెస్ తెరకెక్కించనున్నారు.

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పెళ్ళి వేడుకలు హైలెట్ కానున్నాయి. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పెళ్ళి వైభవాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. 20 రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్ లో పెళ్ళి కొడుకు గెటప్ లో నటించిన నితిన్ మొత్తానికి ఈ గెటప్ కి ప్యాకప్ చెప్పేశాడు.

 

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ, జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ తో పాటు నందిత శ్వేత ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఆగష్టు 9 ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.