అమెరికాలో పవన్ కళ్యాణ్ నితిన్ సినిమా

Thursday,August 31,2017 - 01:00 by Z_CLU

నితిన్ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం U.S. లోని ఎగ్జోటిక్ లొకేషన్స్ లలో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉంది సినిమా యూనిట్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్టోరీ రాశాడు. లై సినిమాతో నితిన్ ఎలాంటి క్యారెక్టర్ అయిన చేసేస్తాడు అని ప్రూవ్ చేసుకున్న ఈ హీరో, ఇప్పుడు మరోసారి డిఫెరెంట్ రొమాంటిక్ హీరోగా మెస్మరైజ్ చేయబోతున్నాడు.

మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ‘లై’ లాంటి డిఫెరెంట్ సినిమా తరవాత తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ లో అప్పుడే ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.