ప్రేమకథల దర్శకుడు

Wednesday,June 26,2019 - 11:02 by Z_CLU

వెంకీ అట్లూరి రీసెంట్ గా కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఈసారి నితిన్ ని హీరోగా ఎంచుకున్నాడు. కానీ తనకు కలిసొచ్చిన  జోనర్ ని మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు… ‘తొలిప్రేమ’ తో దర్శకుడిగా బిగిన్ అయిన వెంకీ అట్లూరి ఈసారి కూడా ప్రేమ కథనే ఎంచుకున్నాడు…

‘రంగ్ దే’ టైటిలే కలర్ ఫుల్ గా ఉంది. దానికి తోడు ‘గివ్ మి సమ్ లవ్’ అని ట్యాగ్ లైన్ పెట్టేసరికి సినిమా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. అందునా వెంకీ అట్లూరి సినిమాలు ఎలా ఉంటాయో యూత్ కి కొత్త కాదు. చేసింది 2 సినిమాలే అయినా ఆడియెన్స్ మైండ్ లో రిజిస్టర్ అయిపోయే సినిమాలనిచ్చాడు వెంకీ అట్లూరి.

ఈ దర్శకుడి కథలొకటే కాదు.. కాస్టింగ్ కూడా కొత్తగా ఉంటుంది. నితిన్, కీర్తి సురేష్ జంటగా అనగానే సినిమా చుట్టూ ఒక్కసారిగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. వీళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ కూడా..

తొలి సినిమాకి ‘తొలిప్రేమ’ టైటిల్ ని రిపీట్ చేసుకున్నాడు… ‘మిస్టర్ మజ్ను’ తో అక్కినేని లవ్ స్టోరీ అంటూ సూపర్ హిట్ అందుకున్నాడు… ఈ వరసలో ‘రంగ్ దే’ తో కూడా సక్సెస్ అందుకుంటే వెంకీ అట్లూరిని ‘ప్రేమకథల దర్శకుడు’ గా గుర్తిస్తారు ఆడియెన్స్.