టాలీవుడ్ బర్త్ డే స్పెషల్

Thursday,October 10,2019 - 11:32 by Z_CLU

ఈ రోజు టాలీవుడ్ కు వెరీ వెరీ స్పెషల్. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. చాలామంది ప్రముఖులు ఈ రోజున తమ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీళ్లలో ఒకరు మన స్టార్ డైరక్టర్ రాజమౌళి. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాతో హిట్ అందుకున్న ఏకైక టాలీవుడ్ దర్శకుడు మన జక్కన్న. తాజాగా బాహుబలి-2తో ఆలిండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్నాడు రాజమౌళి. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ దర్శక ధీరుడు ఎన్టీఆర్-చరణ్ హీరోలుగా ఆర్-ఆర్-ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

rakul-preet-singh-hot-south-actress

ఈరోజు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న మరో స్టార్ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో రకుల్ ఒకరు. చేతినిండా సినిమాలతో కేక్ కట్ చేయడానికి కూడా టైం లేనంత బిజీగా ఉంది రకుల్. తాజాగా నాగ్ సరసన మన్మథుడు-2 సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా ఉంది.

ali-tollywood-comedian_0

దశాబ్దాలుగా ప్రేక్షకులకు నవ్వులు పంచుకున్న నవ్వులరేడు అలీ పుట్టినరోజు కూడా ఇవాళే. పొట్టకూటి కోసం బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన అలీ.. ఒకదశలో హీరోగా కూడా మెప్పించారు.  ప్రస్తుతం తిరుగులేని కమెడియన్ గా కొనసాగుతున్నారు. అటు బుల్లితెరపై కూడా అలీ మేనియా కొనసాగుతోంది.