నిఖిల్ చేతికి రవితేజ సినిమా?

Monday,July 10,2017 - 06:45 by Z_CLU

ఒకరి కోసం అనుకున్న కథను మరొకరు టేకప్ చేయడం కామన్. ఇలాంటి ఓ ఇన్సిడెంట్ తాజాగా బయటపడింది. రవితేజ చేయాల్సిన ఓ సినిమా ఇప్పుడు నిఖిల్ చెంతకు చేరింది.

రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు సినిమాలు ప్రారంభించడాని కంటే ముందు రవితేజ చెంతకు ఓ రీమేక్ సినిమా వచ్చి చేరింది. అదే కనిథన్ కథ. అధర్వ, క్యాథరీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్మాత కళైపులి థాను ప్రయత్నించారు. మొదట రవితేజకు ఈ సినిమా చూపించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు చేయడానికి మాస్ రాజా ముందుకు రాలేదట.

ఇప్పుడా సూపర్ హిట్ సినిమా రీమేక్ ఛాన్స్ నిఖిల్ చెంతకు చేరిందని అంటున్నారు. కేశవతో మరో సక్సెస్ అందుకున్న ఈ హీరో ఇప్పటివరకు మరో ప్రాజెక్టు ఎనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం కనిథన్ రీమేక్ తో పాటు కన్నడలో హిట్ అయిన కిరాక్ పార్టీ రీమేక్ కూడా నిఖిల్ వద్దే పెండింగ్ లో ఉన్నాయి. అయితే నిఖిల్ మాత్రం ఇంకా దేన్నీ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.