బీయింగ్ హ్యూమన్ అనిపించుకున్న సల్మాన్

Monday,July 10,2017 - 06:00 by Z_CLU

సల్మాన్ నెలకొల్పిన స్వచ్చంద సంస్థ పేరు బీయింగ్ హ్యూమన్. ఈ సంస్థపై ఛారిటీ కార్యక్రమాలు చేస్తుంటాడు కండల వీరుడు. ఇప్పుడీ హీరో నిజంగానే మంచి హీరో అనిపించుకున్నాడు. తన వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు కొంత సొమ్ము చెల్లించేందుకు ముందుకొచ్చాడు.

సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన సినిమా ట్యూబ్ లైట్. ఫ్లాప్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిలింది. మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ మొత్తానికి సినిమాను కొనడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. తన సినిమా సరిగ్గా ఆడడం లేదని మొన్నటిమొన్న జరిగిన ఓ ఈవెంట్ లో సల్మాన్ కూడా ఒప్పుకున్నాడు. నటించడంతో పాటు సినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరించిన సల్మాన్.. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటానని ప్రకటించాడు.

సౌత్ లో రజనీకాంత్ లాంటి హీరోలు కొన్ని సందర్భాల్లో డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నారు. ఇప్పుడు సల్మాన్ కూడా ఆ లిస్ట్ లో చేరాడు.