అటు రాజమౌళి... ఇటు వెంకటేష్

Monday,July 10,2017 - 08:15 by Z_CLU

టాలీవుడ్ లో సీనియర్ హీరో నుంచి యంగ్ హీరో వరకూ అందరు 2-3 సినిమాలతో బిజీ అవుతున్నారు. మరికొందరేమో ఏవో కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తూ ఏదో ఓ కాంబోతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్రెజెంట్ ఆ లిస్ట్ కి టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి, సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మాత్రం దూరంగా ఉన్నారు.

బాహుబలి కోసం దాదాపు 5 ఏళ్ల పాటు శ్రమించిన రాజమౌళి బాహుబలి-2తో అద్భుత విజయాన్నందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ ను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు రాజమౌళి. అందుకే బాహుబలి-2 విడుదలై ఇన్ని రోజులైనా ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు. కొత్త ప్రాజెక్టు ప్రకటన కోసం ఇంకాస్త టైం తీసుకునే ఆలోచనలో ఉన్నాడు.

విక్టరీ వెంకటేష్ పరిస్థితి కూడా ఇదే… లేటెస్ట్ గా ‘గురు’తో డిఫరెంట్ లుక్ తో కనిపించి సూపర్ హిట్ అందుకున్న వెంకీ కూడా ఈ సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా నెక్స్ట్ డైరెక్టర్ పై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ లో ముందు ఏం చెప్పినా జరగట్లేదు అందుకే ఈ సారి అన్ని సెట్ అయితేనే కానీ అనౌన్స్ చేయను అంటూ చెప్పిన వెంకీ ఇంత వరకూ తన నెక్స్ట్ డైరెక్టర్ ఎవరన్నది చెప్పలేదు.