నిఖిల్ ఇంటర్వ్యూ

Wednesday,March 07,2018 - 02:11 by Z_CLU

నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ ఈ నెల 16 న రిలీజవుతుంది. అల్టిమేట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిఖిల్ మీడియాతో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

ఇప్పటికీ సేమ్ ఫీలింగ్…

కిర్రాక్ పార్టీ నాకు 15 వ మూవీ. కానీ ఇప్పటికీ ఫస్ట్ సినిమా టైమ్ లో లాగే కంగారు పడుతుంటా… తీరా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ అంతే ఎగ్జైటెడ్ అయిపోతుంటా…

 

ప్రేమించి చేశా….

హ్యాప్పీడేస్ తరవాత మళ్ళీ ఇన్నాళ్ళకు చేస్తున్న కాలేజ్ సినిమా ఇది. ఈ సినిమాలో నన్ను మరీ ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే.. ఇంజనీరింగ్ కాలేజెస్ కల్చర్… మంచి మార్క్స్ వచ్చినా.. మంచి జాబ్స్ రావడం లేదు. దానికి తోడు ఇప్పటి కాలేజెస్ లో ఉన్న పాలిటిక్స్, ఫ్రెండ్ షిప్, బ్రేకప్స్, ఫైట్స్… వినగానే చాలా ఎగ్జైటెడ్ అనిపించింది. చాలా ప్రేమించి చేశానీ సినిమాని…

నేటివిటీ చేంజెస్…

లక్కీగా ‘కిరిక్ పార్టీ’ సినిమా తెలుగులో డబ్ కాలేదు. దాంతో చాలా మంది ఈ సినిమా చూడలేదు. సినిమాని చాలా ఇష్టపడి చేశాం. సినిమాలో ఎక్కడా సోల్ దెబ్బ తినకుండా మన నేటివిటీకి తగ్గట్టు చిన్న చేంజెస్ చేశాం. అద్భుతంగా వచ్చిందీ సినిమా…

రీప్లేస్ చేయలేం…

సంయుక్త హెగ్డే గురించి చెప్పాలంటే లక్ష మందిలో ఒకరుంటారు అలాంటి వాళ్ళు. కాబట్టి ఆ అమ్మాయిని రీప్లేస్ చేసే ఆలోచన బిగినింగ్ నుండి లేదు. ఆ అమ్మాయి ఎనర్జీ లెవెల్స్ కానీ డ్యాన్స్ కానీ.. రేపు మీరు సినిమా చూస్తే తన గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నానో అర్థం అయిపోతుంది…

 

అదే పెద్ద టాస్క్…

సినిమాలో హీరో హీరోయిన్స్ అనే కాదు సినిమాలో ఉండే గ్యాంగ్ విషయంలో కూడా అంతే సీరియస్ గా కాస్టింగ్ చేశాం. కాస్టింగ్ తరవాత మా మద్య కెమిస్ట్రీ బిల్డ్ చేయడం కూడా టాస్క్ లా చేశాం. స్క్రీన్ పై అది చాలా వర్కవుట్ అయింది.

అదే సినిమాలో మెయిన్ పాయింట్…

ఒక నార్మల్ స్టూడెంట్… స్టూడెంట్ లీడర్ గా ట్రాన్స్ ఫామ్ అవుతాడు. ఈ ప్రాసెస్ లో తన ఫ్రెండ్స్, లవ్, ఇమోషన్స్.. ఇదే కిర్రాక్ పార్టీ సినిమా…

ఈ సినిమాలో చాన్స్ దొరికింది…

ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ బెస్ట్ సినిమాలు. కానీ ఈ సిన్మాలో వైడ్ రేంజ్ లో పర్ఫామ్ చేసే అవకాశం దొరికింది… ఇది రాజమండ్రి కి దగ్గరలో రూరల్ ఏరియాలో ఉండే ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ కాబట్టి స్టోరీలో  అన్ని రకాల షేడ్స్ ఉంటాయి…

 

మోటివేట్ చేయడం వరకే…

డైరెక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వడం, రైటింగ్ లో ఇన్వాల్వ్ అవ్వడం లాంటివి నేనస్సలు చేయను. ఎందుకంటే అవి చాలా టఫ్ జాబ్. మహా అయితే నేను డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు అలా పక్కన కూర్చుని మోటివేట్ చేస్తుంటా. అంతవరకే…