మెగా డాటర్ పెళ్లి డేట్ ఫిక్స్

Wednesday,November 04,2020 - 05:39 by Z_CLU

పెళ్లి తేదీ – డిసెంబర్ 9
సమయం – రాత్రి 7 గంటల 15 ని.
వేదిక – ఉదయ్ పూర్

మెగాడాటర్ నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేశారు. వచ్చేనెల 9న నిహారిక మెడలో చైతన్య జొన్నలగడ్డ మూడు ముళ్లు వేయబోతున్నాడు.

నిహారికది డెస్టినేషన్ వెడ్డింగ్ అనే విషయాన్ని నాగబాబు ఇదివరకే ఎనౌన్స్ చేశారు. ఆ బాధ్యతని కొడుకు వరుణ్ తేజ్ కు అప్పగించినట్టు కూడా చెప్పారు. ఇప్పుడా వేదిక కూడా లాక్ అయింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉన్న ఖరీదైన ఉదయ్ విలాస్ రిసార్ట్స్ లో ఈ పెళ్లి జరగనుంది.

పెళ్లిని గ్రాండ్ గా ప్లాన్ చేసినప్పటికీ అతిథుల్ని మాత్రం లిమిటెడ్ గానే పిలుస్తున్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని కేవలం మెగా కుటుంబీకులు, చైతన్య బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారు.