Niharika - అత్తవారింట అడుగుపెట్టిన మెగా డాటర్

Monday,December 14,2020 - 11:45 by Z_CLU

మెగా డాటర్ Niharika Konidela అత్తవారింట్లోకి ప్రవేశించింది. తన భర్త చైతన్య జొన్నలగడ్డ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు మధురానుభూతుల్ని అందరితో పంచుకుంది నిహా. దానికి సంబంధించిన పిక్స్ ను పోస్ట్ చేసింది.

Niharika_at_Father_in_law_house

కొన్ని రోజుల కిందట నిహారిక-చైతన్య పెళ్లి ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. 3 రోజుల పాటు ఆర్భాటంగా జరిగిన ఆ పెళ్లికి మెగా కాంపౌండ్ హీరోలతో పాటు హీరోయిన్లు రీతూవర్మ, లావణ్య త్రిపాఠి కూడా హాజరయ్యారు.

Niharika_at_Father_in_law_house

అలా పెళ్లిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న నిహా.. అట్నుంచి అటు అత్తవారి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇల్లాలిగా ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

Niharika_at_Father_in_law_house

నాగబాబుకు నిహారిక అంటే చాలా ఇష్టం. ప్రతి రోజూ ఆమెను చూడకుండా ఉండలేరు. నిహాపై తన ప్రేమను ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టారు నాగబాబు. పెళ్లి చేసుకొని భర్తతో పాటు వేరే ఇంటికి వెళ్లిన నిహాను చాలా మిస్ అవుతున్నానంటూ నాగబాబు రియాక్ట్ అయ్యారు.