మేజర్ రిస్క్ నుంచి బయటపడిన రాజశేఖర్

Wednesday,November 04,2020 - 05:30 by Z_CLU

కరోనా బారిన పడి కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు హీరో రాజశేఖర్. ఆయన ఆరోగ్య స్థితిపై జీవిత ప్రకటన చేశారు. మేజర్ రిస్క్ నుంచి రాజశేఖర్ బయటపడినట్టు ప్రకటించిన జీవిత, వెంటిలేటర్ పై రాజశేఖర్ ను ఉంచారనే వార్తల్ని ఖండించారు.

“మేజర్ రిస్క్ నుంచి రాజశేఖర్ ను డాక్టర్లు బయటకు తీసుకొచ్చారు. ఆయన మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. రాజశేఖర్ గారు వెంటలేటర్ పై ఉన్నారనే వార్త బాగా వినిపిస్తోంది. అందులో నిజం లేదు. ఆయన ఏ రోజూ వెంటిలేటర్ పై లేరు. ఆయన చాలా క్రిటికల్ కండిషన్ వరకు వెళ్లారు. అప్పుడు కూడా వెంటిలేటర్ పై లేరు. ఎక్సటర్నల్ ఆక్సిజన్ సపోర్ట్ తోనే ఆయన ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ సపోర్ట్ కూడా తగ్గిస్తూ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.”

ఇలా రాజశేఖర్ హెల్త్ కండిషన్ పై జీవిత స్పందించారు. మరికొన్ని రోజుల్లో రాజశేఖర్ ను ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు డిశ్చార్జ్ చేస్తారని కూడా ఆమె తెలిపారు.

తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా సోకిన విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ప్రకటించారు. అందరం ఒకేసారి హాస్పిటల్ లో చేరిన విషయాన్ని కూడా ధృవీకరించారు. రాజశేఖర్ ప్రకటించిన టైమ్ కే కూతుళ్లు శివానీ, శివాత్మిక కోలుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జీవిత కూడా డిశ్చార్జ్ అయ్యారు.