ZeeCinemalu - Nov 5

Wednesday,November 04,2020 - 11:33 by Z_CLU

భీమవరం బుల్లోడు
నటీనటులు : సునీల్, ఎస్తర్ నోరోన్హా
ఇతర నటీనటులు : విక్రమ్ జీత్ విర్క్, సాయాజీ షిండే, రఘుబాబు, సుబ్బరాజు, సత్య రాజేష్, తెలంగాణ శకుంతల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : ఉదయ్ శంకర్
ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు
రిలీజ్ డేట్ : 27 ఫిబ్రవరి 2014
తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో ఇంకా ఎన్నో రోజులు బ్రతకనని తెలుసుకున్న రాంబాబు, ఆ మిగిలిన కొన్ని రోజులు సొసైటీలో చేంజ్ తీసుకురావడం కోసం స్పెండ్చేయాలనుకుంటాడు. అల్టిమేట్ గా తన చుట్టూరా జరుగుతున్న రౌడీయిజాన్ని అంతంచేయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. తీరా కొన్ని రోజుల తరవాత తన ప్రాణాలకు ఏ ఆపద లేదని, అసలు తనకు బ్రెయిన్ ట్యూమరే లేదని తెలుస్తుంది రాంబాబుకి. ఆ తర్వాత రాంబాబు ఏం చేస్తాడు..? మళ్ళీ మునుపటిలాగే సాధారణంగా బ్రతికేస్తాడా..? సొసైటీ కోసం తను చేసే పోరాటాన్ని కంటిన్యూ చేస్తాడా..? అనేదే సినిమాలోని ప్రధాన కథాంశం.

=============================

సంతోషం
నటీనటులు – నాగార్జున, శ్రియ, ప్రభుదేవా, గ్రేసీసింగ్, సునీల్ తదితరులు
సంగీతం – ఆర్పీ పట్నాయక్
దర్శకత్వం – దశరథ్
బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్
నిర్మాత – కేఎల్ నారాయణ
రిలీజ్ – 2002, మే 9
నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి సంతోషం. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, కింగ్ నాగ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది. హార్ట్ టచింగ్ స్టోరీని దర్శకుడు దశరథ్, అంతే హార్ట్ టచింగ్ గా తెరకెక్కించాడు. హీరోయిన్ గ్రేసీ సింగ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది. ఇక మరో హీరోయిన్ శ్రియ, ఎప్పట్లానే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. థీమ్ సాంగ్ తో కలిపి మళ్లీ మళ్లీ హమ్ చేసుకునేలా మొత్తం 8 ట్యూన్స్ ఇచ్చాడు ఆర్పీ పట్నాయక్.

========================

దువ్వాడ జగన్నాథమ్ – డీజే
నటీనటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, రావు రమేష్, మురళి శర్మ, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : హరీష్ శంకర్
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 23 జూన్ 2017
విజయవాడలో సత్యనారాయణపురం అగ్రహారం అనే ఊళ్ళో బ్రాహ్మణ కుర్రాడిగా కుటుంబంతో కలిసి పెళ్లిళ్లకు వంటచేసే దువ్వాడ జగన్నాథం(అల్లు అర్జున్) చిన్నతనంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల సమాజంలో అన్యాయాలు జరగకుండా ఓ మార్పు తీసుకురావాలనుకుంటాడు. ఇందుకోసం ఓ పోలీస్ అధికారి పురుషోత్తం(మురళి శర్మ) సహాయం అందుకున్న దువ్వాడ సమాజంలో ప్రజలకి అన్యాయం చేసే వారిని ఎలా ఏ విధంగా ఎదుర్కున్నాడు.. చివరికి పెద్ద రియల్టర్ గా పేరొంది ప్రజల నుంచి డబ్బు దండుకున్న రొయ్యల నాయుడును ఏ విధంగా ఎదిరించి అంతమొందిచాడు.. అనేది సినిమా కథాంశం.

===============================

నిన్నే ఇష్టపడ్డాను
నటీనటులు – తరుణ్, అనిత, శ్రీదేవి, రాజీవ్ కనకాల, శరత్ బాబు, బ్రహ్మానందం, గిరిబాబు దర్శకుడు – కొండ
డైలాగ్స్ – కోన వెంకట్
బ్యానర్ – శ్రీ దుర్గా ఆర్ట్స్
నిర్మాత – కేఎల్ నారాయణ
సంగీతం – ఆర్పీ పట్నాయక్
రిలీజ్ – జూన్ 12, 2003
వైజాగ్ లో ఉండే చెర్రీ (తరుణ్) సరదాగా ఉండే ఓ కాలేజ్ స్టూడెంట్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన సంజన(అనిత), చరణ్ కాలేజ్ లో చేరుతుంది. ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు, ఆట పట్టించుకోవడాలు జరుగుతుంటాయి. దీంతో చరణ్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావించిన సంజన, అతడ్ని ప్రేమించినట్టు నాటకం ఆడుతుంది. పెళ్లి వరకు తీసుకొచ్చి హైదరాబాద్ చెక్కేస్తుంది.
భగ్నప్రేమికుడిగా మారిన చెర్రీ, సంజన కోసం హైదరాబాద్ వెళ్తాడు. సంజన తనను మోసం చేసిందని తెలుకుంటాడు. సంజనకు కాబోయే భర్త బోనీ (రాజీవ్ కనకాల) సహాయంతో ఆమె ఇంట్లోకి ఎంటరైన చరణ్.. సంజనకు ఎలా బుద్ధిచెప్పాడు. ఈ క్రమంలో మరో అమ్మాయి గీత (శ్రీదేవి)కు ఎలా దగ్గరయ్యాడనేది ఈ సినిమా కథ.
ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ నేహా ధూపియా ఇందులో ఐటెంసాంగ్ చేసింది.

====================================

ఉన్నది ఒకటే జిందగీ
నటీనటులు : రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి
ఇతర నటీనటులు : శ్రీ విష్ణు, ప్రియదర్శి, కిరీటి దామరాజు, హిమజ, అనీషా ఆంబ్రోస్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కిషోర్ తిరుమల
ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్య, స్రవంతి రవి కిషోర్
రిలీజ్ డేట్ : 27 అక్టోబర్ 2017
అభి(రామ్) – వాసు(శ్రీ విష్ణు) ఒకరిని వదిలి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు. చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా జీవితాన్ని గడుపుతున్న అభి – వాసు జీవితంలోకి అనుకోకుండా మహా(అనుపమ) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. స్నేహితుడు తర్వాతే ఇంకెవరైనా అనుకునే అభి- వాసులు మహా వల్ల నాలుగేళ్లు దూరమవుతారు. ఇంతకీ మహా ఎవరు. ఒకరినొకరు వదిలి ఉండలేని అభి – వాసులు ఎందుకు విడిపోయారు.. చివరికి మళ్ళీ ఎలా కలిశారు..అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

================================

విన్నర్
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబు, ఠాకూర్ అనూప్ సింగ్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి పుల్లికొండ, ముకేష్ రిషి, ఆలీ, వెన్నెల కిషోర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017
సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్, గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం.