కోలీవుడ్ ఎంట్రీ .....

Thursday,February 16,2017 - 05:12 by Z_CLU

‘ఒక మనసు’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల ప్రెజెంట్ కోలీవుడ్ పై ఫోకస్ పెడుతూ హీరోయిన్ గా దూసుకెళ్లాలని చూస్తుందట. మొదటి సినిమాలో కథానాయికగా మంచి మార్కులే అందుకున్న ఈ భామ ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రెండో సినిమా కోసం తెలుగులో కొన్ని కథలు విన్న నిహారిక ఫైనల్ గా కోలీవుడ్ డైరెక్టర్ అరుముగ కుమార్ చెప్పిన కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

విజయ్ సేతు పతి హీరోగా అరుముగ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో కోలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుందట ఈ మెగా హీరోయిన్. అయితే విజయ్ సేతు పతి పాటు ‘కడలి’ ఫేమ్ గౌతమ్ కార్తీక్ కూడా ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. మరి నిహారిక కి ఈ సినిమా కోలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ అందిస్తుందో..చూడాలి…