హారరే కానీ డిఫెరెంట్

Thursday,February 16,2017 - 04:08 by Z_CLU

టాలీవుడ్ లో లాంగ్ బ్యాక్ సెట్ అయిన హారర్ సీజన్ ఇప్పట్లో మారే చాన్సెస్ కనిపించడం లేదు. హారర్ ఎలిమెంట్ కి బోలెడంత ఫన్ ని జోడించి బాక్సాఫీస దగ్గర భారీ వసూళ్లతో క్లోజ్ అవుతున్న హారర్ కామెడీ సినిమాలు, చిన్న హీరోల దగ్గర్నించి స్టార్ హీరోల వరకు ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు హారర్ సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చిన బడా హీరోల్లో శ్రీకాంత్ కూడా చేరిపోయాడు.

‘రారా’  టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని నిన్న మెగాస్టార్ లాంచ్ చేశారు. ఆల్ రెడీ స్టోరీలైన్ విన్న మెగాస్టార్ ఇది హారర్ సినిమానే కానీ జస్ట్ హారర్ అనుకోవడానికి లేదు, హారర్ జోనర్ లోనే సం థింగ్ స్పెషల్ మూవీ అనిపించుకుంటుంది అని కితాబిచ్చేశారు.

మనుషులకు, భూతాలకు జరిగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాని విజయ్ నిర్మిస్తున్నాడు. విజి చరిష్ డైరెక్షన్ చేస్తున్నాడు.