బెల్లంకొండ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

Friday,November 29,2019 - 01:00 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న చిత్రం ప్రారంభ‌మైంది. రామానాయుడు స్టుడియోస్ లో జరిగిన ఈ ఓపెనింగ్ లో.. డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ల‌వ్-యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా వస్తోంది. డిసెంబ‌ర్ 6 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, దుబాయ్, అబ్రాడ్ లో షూటింగ్ చేస్తారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అల్లుడు శీను, జ‌య‌జాన‌కి నాయ‌క త‌ర్వాత దేవిశ్రీ ప్ర‌సాద్, బెల్లంకొండ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది.

సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్
సినిమాటోగ్రఫీ: డుడ్లీ
ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్ల‌
ఎడిట‌ర్: త‌మ్మిరాజు
మాట‌లు: శ్రీకాంత్ విస్సా
నిర్మాత: గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం
స్టోరీ, స్కీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్ష‌న్: సంతోష్ శ్రీనివాస్