Nenu Meeku Baaga Kavalsina Vaadini ట్రైలర్ రివ్యూ

Thursday,September 08,2022 - 05:11 by Z_CLU

 కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నేను మీకు బాగా కావల్సిన వాడిని’ అన్ని కార్యక్రామాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. సెప్టెంబర్ 16న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ట్రైలర్ రిలీజ్ చేసి టీంకు అభినందనలు తెలిపారు.

ట్రైలర్ విషయానికొస్తే సినిమాలో హైలైట్స్ అన్ని గ్లిమ్స్ గా పెట్టి ఆకట్టుకునేలా కట్ చేశారు. ఇష్టం లేని అబ్బాయిను ప్రేమించిన కూతరికి తండ్రి క్లాస్ పీకే సీన్ తో మొదలైన ట్రైలర్ కిరణ్ అబ్బవరం ఎనర్జీ , డైలాగ్స్ , యూత్ ఫుల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్ గ్లిమ్స్  తో మెప్పించి సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.

ముఖ్యంగా ట్రైలర్ లో హీరో -హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. అలాగే హీరో -తండ్రి తో హీరో కన్వర్జేషన్ సీన్ , ఫైట్ కూడా బాగుంది. ట్రైలర్ ఎండింగ్ లో కిరణ్ అబ్బవరం ఫైట్ చేసి కూల్ గా డైలాగ్ పంచ్ మాస్ ని మెప్పించేలా ఉంది.  ఓవరాల్ గా క్లాస్ ప్లస్ మాస్ ని మెప్పించేలా దర్శకుడు శ్రీధర్ ఈ సినిమాను తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రాజ్ నల్లి విజువల్స్ , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి.

కోడి రామకృష్ణ గారి తనయురాలు కోడి దివ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజన , సోను ఠాకూర్ హీరోయిన్స్ గా నటించారు. కిరణ్ అబ్బవరం స్క్రీన్ ప్లే -డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజర్.