'Vinaro Bhagyamu Vishnu Katha' రెండ్రోజుల కలెక్షన్స్

Monday,February 20,2023 - 11:12 by Z_CLU

Kiran Abbavaram’s ‘Vinaro Bhagyamu Vishnu Katha’ 2 days Collections

‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం అతి తక్కువకాలంలోనే మంచి గుర్తింపు సాధించుకున్నాడు. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinarobhagyamu VishnuKatha) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు  కిరణ్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  బ‌న్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు.

కిరణ్ అబ్బవరం హీరో జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై రిలీజ్ కి ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలక్షన్స్ తో దూసుకుపోతుంది. నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 2.75 కోట్ల గ్రాస్ ను, రెండవరోజు 2.40 కోట్ల గ్రాస్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 5.15 కోట్ల గ్రాస్ ను సాధించి  ద్విగిజయంగా ముందుకు సాగుతుంది.

ఈ సినిమాతో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడుగా పరిచయమయ్యారు. కిరణ్ సరసన కశ్మీర పరదేశి ఈ సినిమాలో నటించింది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పించారు.

 

మొదటి రోజు : 2.75Cr

రెండో రోజు : 2.45Cr

రెండ్రోజుల మొత్తం  కలెక్షన్స్  – 5.15Cr (గ్రాస్ )

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics