Krishna Vrinda Vihari ట్రైలర్ రివ్యూ

Saturday,September 10,2022 - 05:23 by Z_CLU

Naga Shaurya’s ‘Krishna Vrinda Vihari’ trailer talk

నాగ శౌర్య హీరోగా అనీష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కృష్ణ వ్రిందా విహారి’ రిలీజ్ కి రెడీ అయింది. సెప్టెంబర్ 23న సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ లవ్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.

ప్రతీ సినిమా ముకేష్ యాడ్ తో మొదలయినట్టు నా కథ వీడితో మొదలవుతుంది. సత్య నా డాక్టర్.. కోమా నుండి రావడం వాడికి ఎంత ఇంపార్టెంట్ తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ ” అంటూ  వెన్నెల కిషోర్ బెడ్ పై పడుకుంటే నాగ శౌర్య చెప్పే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ లో నాగ శౌర్య ఉద్యోగం కోసం ఊరి నుండి సిటీకి రావడం , సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరి ఒకమ్మాయితో ప్రేమలో పడటంతో  సినిమాలో ఉండే ఫన్ అలాగే లవ్ సీన్స్ చూపిస్తూ కట్ చేశారు.  సినిమాలో ఉండే కేరెక్టర్స్ ద్వారా ఎలాంటి కామెడీ క్రియేట్ అవుతుందో కామెడీ సీన్స్ గ్లిమ్స్ తో ట్రైలర్ లో చూపిస్తూ సినిమాపై ఓ మోస్తారు అంచనాలు పెంచేశారు.

ముఖ్యంగా సినిమాలో వెన్నెల కిషోర్ కేరెక్టర్ కీ రోల్ పోషించనుందని అర్థమవుతుంది. అలాగే సత్య -రాహుల్ రామకృష్ణ కామెడీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేస్తుందని ట్రైలర్ ఎండింగ్ లో వేసిన సీన్ చూస్తే తెలుస్తోంది. ఓవరాల్ గా నాగ శౌర్య నుండి ఓ డీసెంట్ రొమాంటిక్ ఫన్ ఎంటర్టైనర్ ఫిలిం రాబోతుందని ట్రైలర్ తో మేకర్స్ చెప్పకనే చెప్పారు. మరి మొదటి సినిమా ‘అలా ఎలా’ తో ప్రేక్షకులను హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసి హిట్ అందుకున్న దర్శకుడు అనీష్ ఈ సినిమాతో శౌర్య ని బ్రాహ్మణ అబ్బాయిగా ప్రెజెంట్ చేస్తూ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

ఐరా క్రియేషన్స్ బేనర్ పై ఉష ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శిర్లె సెటియా హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ ఈ కీలక పాత్రలో నటించారు.