Kiran Abbavaram ఇది మాస్ మీటర్

Wednesday,April 05,2023 - 05:32 by Z_CLU

Kiran Abbavaram Speech at Metre PreRelease Event

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానున్న నేపధ్యంలో మీటర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో  కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ” మీటర్ సినిమా హైవోల్టేజ్ తో స్టార్ అయ్యింది. ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన చెర్రీ గారికి కృతజ్ఞతలు. నవీన్ గారికి, రవిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్ట్ డైరెక్టర్ జేవీ, డీవోపీ దిలీప్, సాయి కార్తిక్ .. అందరికీ కృతజ్ఞతలు. సప్తగిరి ఎంతో సపోర్ట్ గా వున్నారు. అతుల్య చాలా బాగా పెర్ ఫార్మ్ చేసింది. రమేష్ నన్ను చాలా డిఫరెంట్ గా చూపించారు. మాస్ కమర్షియల్ ఆడియన్ కి ఎలాంటి ఎలిమెంట్స్ తో కథ కావాలో అవన్నీ ఇందులో ప్రజంట్ చేశారు. సినిమా అవుట్ అండ్ అవుట్ మీటర్ లో వుంటుంది. సినిమా హై వోల్టేజ్ ఎనర్జీటిక్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. అప్పుడే అయిపోయిందా? అనే ఫీలింగ్ కూడా ఇస్తుంది. విజల్స్ కొట్టి గోల చేసి థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేసే కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. సమ్మర్ కి మీరు ఆ ఎనర్జీ ఫీలౌతారు. థియేటర్ లో కూర్చున్నప్పుడు మీరు ఊహించిన దానికంటే ఎకువ ఎక్సయిట్ అవుతారు. నన్ను చాలా కొత్తగా చూస్తారు. సమ్మర్ లో అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్ టైనర్ మీటర్. మంచి హాలీడే సీజన్. రవితేజ గారి సినిమా, మీటర్ రెండూ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు చూసి వీకెండ్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీటర్ కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయని అనుకుంటున్నాను. మాస్ మీటర్ ఇది. మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్న మీటర్ మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు