యూ ట్యూబ్ లో నేను లోకల్ హంగామా

Wednesday,January 18,2017 - 01:50 by Z_CLU

నాని నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందోనన్న క్వశ్చన్ ఎవరికీ వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఆన్సర్ మాత్రం ఈ సారి కూడా సం థింగ్ డిఫెరెంట్ గా మాత్రం గ్యారంటీగా ఉంటుంది అనే కంక్లూజన్ తోనే క్లోజ్ అవుతుంది. అది న్యాచురల్ స్టార్ నాని గుడ్ విల్. అదే రీసెంట్ గా రిలీజైన ‘నేను లోకల్’ సినిమా ట్రేలర్ యూట్యూబ్ లో ఈ లెవెల్ లో సక్సెస్ అవ్వడానికి రీజన్. ఇప్పటికే 1.1 మిలియన్ వ్యూస్ ని దాటిన యూ ట్యూబ్ వ్యూస్ 2 మిలియన్ మైల్ స్టోన్ ని చేజ్ చేసే పనిలో ఉన్నాయి.

కీర్తి సురేష్ హీరోయిన్ గా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘నేను లోకల్’ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓ పెద్ద ఎసెట్. ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు ఇటు యూత్ లోను ఫాస్ట్ పేజ్ లో కనెక్ట్ అవుతున్న సాంగ్స్ సినిమా సక్సెస్ గ్యారంటీ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తున్నాయి.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ, యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తరవాత నాని రొమాంటిక్ కామెడీ సినిమాలకి మాస్టర్ అనిపించుకోవడం గ్యారంటీ అని టాలీవుడ్ టాక్.