400 కోట్ల మార్కెట్ లో దంగల్

Wednesday,January 18,2017 - 03:15 by Z_CLU

దంగల్ సినిమా చేసేద్దామనుకున్నప్పుడు కూడా సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. డిసెంబర్ 23 న రిలీజైన దంగల్, ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఆడటం ఒక ఎత్తైతే, సినిమా రిలీజ్ కూడా కాకముందే క్రియేట్ అయిన క్రేజ్ ఇప్పటికీ తగ్గకపోవడం ఇంకో ఎత్తు.
జస్ట్ ముంబై లోనే ఇప్పటికీ 100 కోట్లు వసూలు చేసిన దంగల్, ఓవరాల్ గా జనవరి 16 వరకు వసూలు చేసిన మొత్తం ₹ 371.48 కోట్లు. రిలీజైన ప్రతి సెంటర్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్న ఈ సినిమా 400 కోట్ల వసూళ్ళకి అతి చేరువలో ఉంది.
తన కూతుళ్ళను వరల్డ్ చాంపియన్ గా చూడాలని డెడికేటెడ్ గా కష్టపడే తండ్రి పాత్రలో, రియల్ డెడికేషన్ తో అమీర్ ఖాన్ నటించిన తీరు, బాక్సింగ్ ఎలిమెంట్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి.