మళ్ళీ ఐటెం సాంగ్ చేస్తా

Wednesday,January 18,2017 - 12:50 by Z_CLU

ఖైదీ నం 150 సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న కాజల్ సరికొత్త రిజొల్యూషన్స్ తో కరియర్ ని ప్లాన్ చేసుకుంటుంది. అంది వస్తున్న ఆఫర్స్ లో బెస్ట్ వెంచర్స్ అయితేనే సంతకం చేయాలి అని డిసైడ్ అయిన ఈ మెగా హీరోయిన్ జనతా గ్యారేజ్ కి ముందు కనీసం ఐటం సాంగ్ ఊసు కూడా ఎత్తలేదు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా ట్రాక్ మార్చేసింది.

హీరోయిన్ గా చేస్తూనే ఐటం సాంగ్ చేయడానికి తనకు ఏ అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చిన కాజల్ కాస్ట్ లీ కండిషన్స్ ని కూడా అప్లై చేసింది. స్టార్ హీరో సినిమా అయితే కానీ నో ఐటం సాంగ్ అని తెగేసి చెప్పిన కాజల్, బ్రాండ్ రెమ్యూనరేషన్ తో పాటు సాంగ్ పాప్యులారిటీ ని మైండ్ లో పెట్టుకునే డెసిషన్ తీసుకుంటాను అని అటు ప్రొడ్యూసర్స్ కి ఇటు డైరెక్టర్స్ కి చిన్న సైజు క్లారిటీ కూడా ఇచ్చేసింది.

ప్రస్తుతం తేజ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కాజల్, 2017 లో ఎలాగైనా బ్యాక్ టు గ్లోరీ టైప్ లో ఫాస్ట్ పేజ్ లోకి చేరాలనే ఆలోచనలో ఉంది. మ్యాగ్జిమం ఆన్ స్క్రీన్ అప్పియరెన్స్ తో కనెక్ట్ అయితే కానీ వర్కవుట్ అయ్యేలా లేదని డిసైడ్ అయిన కాజల్ ఫ్యాన్స్ కి మరింత క్లోజ్ అవ్వాలనే ప్లాన్ లో ఉంది.