
మోహిని
నటీనటులు : త్రిష, జాకీ భజ్ఞాని
ఇతర నటీనటులు : ముకేష్ తివారీ, పూర్ణిమ భాగ్యరాజ్, యోగి బాబు, జాంగిరి మధుమిత, జ్ఞానేశ్వర్, స్వామినాథన్ మరియు తదితరలు
మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ – మెర్విన్
డైరెక్టర్ : రమణ మాదేశ్
ప్రొడ్యూసర్ : S. లక్ష్మణ్ కుమార్
రిలీజ్ డేట్ : 27 జూలై 2018
ఇండియాలో పాపులర్ చెఫ్ వైష్ణవి (త్రిష). ఆమెకు లండన్ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. అక్కడకు తన టీమ్ తో పాటు వెళ్తుంది వైష్ణవి. అక్కడే సందీప్ (జాకీ భగ్నానీ) ను కలుస్తుంది. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లికి (పూర్ణిమ) కూడా చెప్పేస్తుంది వైష్ణవి. ఇక్కడ వరకు అంతా ప్రశాంతం.సడెన్ గా తన బాయ్ ఫ్రెండ్ సందీప్, టీమ్ తో కలిసి బోటు షికారుకు వెళ్తుంది వైష్ణవి. అక్కడే ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన కారణంగా సముద్ర గర్భంలో ఓ శంఖంలో కొన్నేళ్లుగా ఉన్న మోహిని (త్రిష) ఆత్మ బయటకు వస్తుంది. బయటకొచ్చి తనలా ఉన్న వైష్ణవిని చూసి ఆమెలో ప్రవేశిస్తుంది.
గతంలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై వైష్ణవి రూపంలో ఉన్న మోహిని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగా తనను చంపిన గుంపులో సందీప్ కూడా ఉన్నాడనే చేదు నిజం తెలుసుకుంటుంది. వైష్ణవిలోకి మోహిని ప్రవేశించిందనే విషయాన్ని సందీప్ తో పాటు విలన్లు గుర్తిస్తారు. మరో క్షుద్ర మాంత్రికుడితో కలిసి మోహినిని బంధించాలని, అవసరమైతే వైష్ణవిని చంపేయాలని చూస్తారు. ఫైనల్ గా విలన్లను మోహిని ఏం చేసింది.. విలన్ల బారి నుంచి వైష్ణవిని మోహిని ఎలా కాపాడింది అనేది ఈ సినిమా స్టోరీ.
____________________________________

రామయ్యా వస్తావయ్యా
నటీనటులు : NTR, శృతి హాసన్, సమంత రుత్ ప్రభు
ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్, ముకేష్ రిషి, కోట శ్రీనివాస్ రావు, రావు రమేష్, తనికెళ్ళ భరణి
సంగీతం : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
నిర్మాత : దిల్ రాజు
జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్, సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లా, జాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.
_______________________________________

హైపర్
నటీనటులు : రామ్ పోతినేని, రాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్, నరేష్, రావు రమేష్, తులసి శివమణి, ప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016
వైజాగ్ లో ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
_____________________________________________

తడాఖా
నటీనటులు : నాగచైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా జెరెమియా
ఇతర నటీనటులు : ఆశుతోష్ రానా, నాగేంద్ర బాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, రమాప్రభ మరితు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 10th మే 2013
నాగచైతన్య, సునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలాచేదోడు వాదోడుగా నిలిచాడు, కథ చివరికి ఏ మలుపు తిరిగిందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
_______________________________________________

నేను లోకల్
నటీనటులు : నాని, కీర్తి సురేష్
ఇతర నటీనటులు : నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, తులసి, రామ్ ప్రసాద్, రావు రమేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : త్రినాథ రావు నక్కిన
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2017
బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్ పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.
______________________________________

నటీ నటులు : మమ్ముటీ , జై, జగపతిబాబు, సన్నీలియోన్, సలీం కుమార్ తదితరులు.
ఛాయాగ్రహణం : షాజీ కుమార్
సంగీతం : గోపీ సుందర్
కథ -స్క్రీన్ ప్లే : ఉదయ్ కృష్ణ
దర్శకత్వం : వైశాక్
సహ నిర్మాత: నూల అశోక్
నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ
విడుదల తేది : 1 జనవరి 2020