మరో రికార్డ్ బ్రేక్ చేసిన నేను లోకల్

Tuesday,February 07,2017 - 11:18 by Z_CLU

ఆటిట్యూడ్ ఈజ్ ఎవ్రీ థింగ్ అంటూ బరిలోకి దిగిన నాని ‘నేను లోకల్’ రికార్డ్స్ బ్రేక్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుందా అనిపిస్తుంది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తున్న ఈ సినిమా, మరో సరికొత్త రికార్డ్ ని ఆల్ రెడీ బ్రేక్ చేసేసింది.

వీకెండ్ ని 100% యుటిలైజ్ చేసుకున్న నేను లోకల్, ఇప్పుడు చెన్నై బాక్సాఫీస్ రికార్డుల్లో 5 వ స్థానంలో నిలిచింది. అటు యూత్, మాస్, ఫ్యామిలీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా, ఓవర్ సీస్ లోనే కాదు, చెన్నై లాంటి ప్లేసెస్ లో కూడా నేను లోకల్ అనిపించుకుంటుంది.

nenu-local-zee-cinemalu

రిలీజ్ అయిన ప్రతి సెంటర్ లో హౌజ్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్న నేను లోకల్, నాని కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. సరికొత్త క్యారెక్టరైజేషన్ తో మెస్మరైజ్ చేస్తున్న నాని పర్ఫామెన్స్ సినిమా సక్సెస్ కి మేజర్ ఎసెట్ గా నిలుస్తుంది.