సింగం 3 లో హైలెట్ గా నిలిచే పాయింట్

Tuesday,February 07,2017 - 10:12 by Z_CLU

సింగం 3 ఫిబ్రవరి 9 న రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. హై ఎండ్ ఎంటర్ టైనర్ గా రిలీజ్ అవుతున్న సింగం 3, ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ చుట్టూ తిరుగుతుంది.

సింగం 2 లో ఆపరేషన్ D హైలెట్ అయినట్టు, ఈ సినిమాలో ఎన్విరాన్ మెంట్ హైలెట్ కానుంది. ఆస్ట్రేలియాలో ఉండే విలన్ కి, ఇండియా పర్యావరణానికి ఉండే కనెక్టివిటీపై మొత్తం సినిమా రన్ అవుతుంది. ఆ కనెక్టివిటీ క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్, వాటిని సింగం తన టీంతో ఎలా ఫేస్ చేశాడన్నదే ప్రధాన కథాంశం.

singham-3-updates-zee-cinemalu

అనుష్క తో పాటు, శృతి హాసన్ కూడా హీరోయిన్ గా నటించిన సింగం 3 లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ కానున్నాయి. ఇప్పటికే హెవీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా సింగం 2 కన్నా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.