'కృష్ణార్జున యుద్ధం' ఆడియో రివ్యూ

Tuesday,March 27,2018 - 10:03 by Z_CLU

నాని ‘కృష్ణార్జున యుద్ధం’ జ్యూక్ బాక్స్ రిలీజయింది. వరసగా ఫస్ట్ లుక్ తరవాత ఒకదాని తరవాత ఒకటి 3 సింగిల్స్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఈ సినిమా ఆడియో జ్యూక్ బాక్స్ రిలీజ్ చేసింది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్స్  మ్యూజిక్ లవర్స్ ని  ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాయో  ఒకసారి చూద్దాం.

 

 

టర్న్ దిస్ పార్టీ అప్ : డెఫ్ఫినేట్ గా అర్జున్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే సాంగ్. రాక్ స్టార్ అర్జున్ ఇంట్రడక్షన్ లో భాగంగా వెస్ట్రన్ స్టైల్ లో ఉండే ఈ సాంగ్ థియేటర్ లో యూత్ ని ఉర్రూతలూగించడం ఖాయం. హిప్ హాప్ తమిళ, బ్రోద వి. కలిసి పాడిన ఈ సాంగ్ కి హిప్ హాప్ తమిళ లిరిక్స్ రాశాడు.

దారి చూడు : సినిమా స్టామినాని ఎలివేట్ చేసిన సాంగ్ ఇది. ఆల్ రెడీ ఈ సినిమా గురించి క్రియేట్ అయి ఉన్న బజ్ కి మరింత వెయిట్ ఆడ్ చేసిందీ సాంగ్. చిత్తూరు యాసలో, పుట్ట పెంచల్ దాస్ రాసి, పాడిన ఈ సాంగ్, రిలీజ్ అయిన రోజే మ్యూజిక్ లవర్స్ ఫేవరేట్ లిస్టులో చేరిపోయింది. సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ ఈ సాంగ్.

ఐ వాన ఫ్లై : సినిమాలోని రొమాంటిక్  ఆంగిల్ ని రివీల్ చేసే సాంగ్. అటు కృష్ణ, ఇటు అర్జున మ్యానరిజం కి తగ్గట్టుగా LV రేవంత్, సంజిత్ హెగ్డే పాడిన ఈ సాంగ్, యూత్ కి ఫేవరేట్ హమ్మింగ్ సాంగ్ లా మారింది. అటు మెలోడియస్ తో పాటు వెస్ట్రన్ ట్యూన్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా పాప్యులర్ అయింది. ఈ పాటకి శ్రీజో లిరిక్స్ కంపోజ్ చేశాడు.

 

ఎలా..ఎలా… : సిచ్యువేషన్ వెనక ఎగ్జాక్ట్ రీజన్ సినిమా చూడకుండా గెస్ చేయడం కష్టమే కానీ, మొత్తానికి అటు కృష్ణ, ఇటు అర్జున్ లవ్ లైఫ్ లో డిస్టబెన్స్ వచ్చినప్పుడు ఉండే సాంగ్. ఆల్మోస్ట్ సినిమాలో టర్నింగ్ పాయింట్ కి దగ్గరలో ఉండే సాంగ్ అనిపిస్తుంది. శ్రీమణి రాసిన ఇమోషనల్ లిరిక్స్ కి యాజిన్ నజీర్ వాయిస్ కలవడంతో పాట  హార్ట్ టచింగ్ గా ఉండి ఎట్రాక్ట్ చేస్తుంది.

ఉరిమే మనసే : తన ప్రేయసిని తలుచుకుంటూ రాక్ స్టార్ అర్జున్ పాడే సాంగ్. కంప్లీట్ వెస్ట్రన్ స్టైల్ లో కంపోజ్ అయిన ఈ సాంగ్ ని రఘు దీక్షిత్ పాడాడు. శ్రీజో లిరిక్స్ కంపోజ్ చేశాడు.

 

తానే వచ్చిందనా : సినిమా మొత్తంలో మోస్ట్ మెలోడియస్ సాంగ్. నాని, రుక్సార్ మీర్ లపై తెరకెక్కింది ఈ సాంగ్. కాళభైరవ, పద్మలత కలిసి పాడిన ఈ పాటకి K.K. లిరిక్స్ రాశాడు ఈ సాంగ్ జస్ట్ వినడం కన్నా,  అందమైన లొకేషన్స్, రుక్సార్ గ్లామర్ తో స్క్రీన్ పై మరింత ఎలివేట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి.

మొత్తానికి ఈ సినిమా సాంగ్స్ తో నాని డిఫెరెంట్ స్టోరీ సెలక్షనే కాదు, సాంగ్స్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకుంటున్నాడనిపిస్తుంది. హిప్ హాప్ తమిళ ఈ ఆల్బమ్ తో మరోసారి ది బెస్ట్ అనిపించుకున్నాడు.