చిట్టిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Tuesday,March 27,2018 - 11:00 by Z_CLU

ఈ ఏడాది రామ్ చరణ్ బర్త్ డే ను, చిట్టిబాబు పేరిట జరుపుకోవాలేమో. అవును.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా చిట్టిబాబే పేరు, రంగస్థలం సినిమానే. అందుకే అందరూ చిట్టిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరో 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకానుంది రంగస్థలం సినిమా. ప్రస్తుతం బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న రామ్ చరణ్, రంగస్థలం సక్సెస్ తో డబుల్ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాడు.

ఈ ఏడాది చెర్రీ బర్త్ డేకు మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఈ ఏడాదితో చరణ్ ఇండస్ట్రీకొచ్చి సరిగ్గా దశాబ్దం అవుతుంది. ఈ పదేళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తో పాటు రంగస్థలం లాంటి డిఫరెంట్ మూవీని పరిశ్రమకు అందిస్తున్నాడు. ఈ రెండు సినిమాల మధ్యలో బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఉన్నాయి.

రంగస్థలం నుంచి తన దారి మారిందంటున్న చరణ్.. ఇకపై తన ప్రతి సినిమాతో ఓ కొత్త చెర్రీని చూస్తారని భరోసా ఇస్తున్నాడు. చిట్టిబాబులాంటి మరెన్నో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ.. వరుస బ్లాక్ బస్టర్స్ తో చెర్రీ దూసుకుపోవాలని మనసారా కోరుకుంటోంది జీ సినిమాలు. హ్యాపీ బర్త్ డే టు మిస్టర్ సి.