ఓవర్ సీస్ లో ఫ్యాన్స్ తో నాని నేను లోకల్ ప్రీమియర్ షో

Wednesday,February 01,2017 - 03:50 by Z_CLU

నాని ‘నేను లోకల్’ ఫిబ్రవరి 3 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీగా ఉంది. కేవలం ఒక్క USA లోనే ఏకంగా 125 కన్నా ఎక్కువ లొకేషన్ లలో రిలీజవుతున్న నేను లోకల్ ఓవర్ సీస్ లోను అంతే కాన్ఫిడెంట్ గా మార్కెట్ ని సెట్ చేసుకుంటుంది. చాలాచోట్ల ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది.

నేను లోకల్ సినిమా రిలీజ్ తో పాటు ఇంకో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే… Bay Area లోని Serra Theatres లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడబోతున్నాడు నాని. ఈ థియేటర్స్ లో రాత్రి 8 గంటలకు ఒక షో, 8:30 కు మరో స్పెషల్ షో ప్లాన్ చేశారు డిస్ట్రిబ్యూటర్స్.

nani-nenu-local-premier-show-with-fans

బే ఏరియాతో పాటు బిగ్గెస్ట్ స్క్రీన్స్ ఉన్న ఏరియాల్లో Frank theatres, Cary, NC and Mann Theatres, Plymouth (New), Minneapolis, MN తో పాటు పోర్ట్ లాండ్, డల్లాస్, హ్యూస్టన్, కేరి, ఫిలడెల్ఫియా, మినిపాలిస్ మరియు న్యూజెర్సీ లోను నాని లోకల్ రిలీజవుతుంది.

హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజవుతున్న నాని నేను లోకల్ ఇప్పటికే యూ ట్యూబ్ లో 2.75 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లిస్టులో ఉంది. దానికి తోడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాని రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ ని అటాచ్ చేసేసింది.